నీడ కోసం స్ట్రీట్ లైట్ కింద నిల్చుంటే.. జారిపడి ప్రాణం తీసింది!
- హైదరాబాద్ శివారులోని దమ్మాయిగూడలో ఘటన
- స్ట్రీట్‌లైట్ తలమీద పడడంతో తీవ్ర గాయాలు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఇద్దరూ మాట్లాడుకుంటుండగా స్ట్రీట్ లైట్ అకస్మాత్తుగా ఊడిపడి కిష్టయ్య తలపై పడింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కిష్టయ్య కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.