హైదరాబాద్ లో భారీ వర్షం.. సేదదీరిన జనం!
Add ap7am to your home Screen

హైదరాబాద్ లో భారీ వర్షం.. సేదదీరిన జనం!

  • జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం
  • ఈదురుగాలులతో కూడిన వర్షంతో నేలకూలిన చెట్లు
  • నిలిచిన విద్యుత్ సరఫరా..స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు రాత్రి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, అడ్డగుట్ట, సీతాఫల్ మండి, రాణీగంజ్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మూసాపేట్, కూకట్ పల్లి, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా కొన్ని చోట్ల చెట్లు, హోర్డింగ్స్ నేలకూలాయి. పలు చోట్ల రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎమర్జెన్సీ బృందాలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.
Telangana
Hyderabad
rain
ameerpet
kukatpally

More Telugu News