ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధాలే: పళనిస్వామి
- స్టాలిన్ కు పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్
- ఎగ్జిట్ పోల్స్ చెప్పేవన్నీ నిజాలు కాదన్న పళనిస్వామి
- 39 సీట్లను గెలుచుకుంటామంటూ ధీమా
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధాలే అని ఆయన అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్నాడీఎంకే కూటమి మొత్తం 39 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే, వాటి అంచనాలను తలకిందులు చేస్తూ అన్నాడీఎంకే ఏకంగా 37 సీట్లను కైవసం చేసుకుని... అందరికీ షాక్ ఇచ్చింది.