విలన్‌ను హీరో అంటే నేనెలా అంగీకరిస్తా?: కమలహాసన్
- నా హీరో మహాత్మాగాంధీనే
- గాంధీ హత్య తర్వాత ఆయన కళ్లజోడు, చెప్పులు పోయాయి
- నాపై చెప్పు విసిరిన వ్యక్తికే అది అవమానం
గాంధీ హత్యకు గురైన రోజున ఆయన కళ్లజోడు, చెప్పులు పోయాయని, ఇటీవలే ఈ విషయం తనకు తెలిసిందన్నారు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువేనంటూ ఇటీవల తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కమల్ మాట్లాడుతూ.. ఓ విలన్‌ను తాను హీరోగా ఎప్పటికీ అంగీకరించబోనన్నారు. గాంధీనే తన హీరో అని పునరుద్ఘాటించారు. ఇటీవల ఓ వ్యక్తి తనపై చెప్పు విసిరిన విషయం గురించి మాట్లాడుతూ, అది అతడికే అవమానమని కమల్ పేర్కొన్నారు.