2018లో జవాను ఔరంగజేబ్ ను చంపిన టెర్రరిస్టును మట్టుబెట్టిన భద్రతాదళాలు
Add ap7am to your home Screen

2018లో జవాను ఔరంగజేబ్ ను చంపిన టెర్రరిస్టును మట్టుబెట్టిన భద్రతాదళాలు

  • జమ్ముకశ్మీర్ లో రెండు ఎన్ కౌంటర్లు
  • నలుగురు టెర్రరిస్టుల హతం
  • ఆయుధాలు, మందుగుండు స్వాధీనం
జమ్ముకశ్మీర్ లోని పుల్వామా, బారాముల్లా జిల్లాలలో భద్రతాదళాలు ఈరోజు నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. వీరిలో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందినవారు. వీరంతా కశ్మీరీలే కావడం గమనార్హం.

పుల్వామా జిల్లాలోని పంజ్ గామ్ గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని షౌకత్ అహ్మద్ దార్, ఇర్ఫాన్ అహ్మద్, ముజఫర్ అహ్మద్ గా గుర్తించారు. గత ఏడాది జవాను ఔరంగజేబ్ ను టెర్రరిస్టులు కిరాతకంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు పాల్పడిన వారిలో షౌకత్ అహ్మద్ దార్ కూడా ఉన్నాడు.

బారాముల్లా సెక్టార్ లో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో మరో టెర్రరిస్టు హతమయ్యాడు. చనిపోయిన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, భారీ ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Jammu And Kashmir
encounter

More Telugu News