తమిళ 'బిగ్ బాస్-3' హోస్ట్ గా మళ్లీ కమలహాసనే!
- స్టార్ విజయ్ టీవీలో బిగ్ బాస్-3 టీజర్
- వరుసగా మూడోసారి హోస్ట్ గా కమల్
- ఇంకా వెల్లడి కాని పోటీదారుల పేర్లు
ఇప్పటికి రెండు సీజన్లుగా తన వాక్చాతుర్యంతో సమ్మోహితుల్ని చేస్తున్న కమలహాసన్ మరోసారి ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కమలహాసన్ బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దూకిన నేపథ్యంలో కమల్ బిగ్ బాస్ తో అనుబంధాన్ని కొనసాగిస్తారా? అంటూ వచ్చిన సందేహాలకు స్టార్ విజయ్ టీవీ లేటెస్ట్ టీజర్ తో అడ్డుకట్ట వేసింది. అందులో కమల్ కనిపించడంతో తాజా సీజన్ హోస్ట్ ఆయనేనని రూఢీ అయింది.
ఇక కంటెస్టెంట్లుగా ప్రియా ఆనంద్, వీజే సింధూ, రాధారవి, ప్రేమ్ జీ, సుధా చంద్రన్, లైలా మెహదీన్, చాందినీ తమిళరసన్, సాక్షి అగర్వాల్ ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, బిగ్ బాస్-3 పోటీదారుల విషయంలో అధికారిక సమాచారం రావాల్సి ఉంది.