బాలయ్యను కలవాలని నిర్ణయించుకున్న బోయపాటి!
Add ap7am to your home Screen

బాలయ్యను కలవాలని నిర్ణయించుకున్న బోయపాటి!

  • కెఎస్. రవికుమార్ తో బాలకృష్ణ 
  • పెద్ద బ్యానర్ నుంచి బోయపాటికి ఆఫర్ 
  • బాలయ్యతో ఓ మాట చెప్పేందుకు సిద్ధం 
బాలకృష్ణ తన తదుపరి సినిమా బోయపాటి శ్రీనుతో ఉంటుందని ఎన్టీఆర్ బయోపిక్ సమయంలోనే చెప్పారు. అయితే ఆ తరువాత ఆయన కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నారు. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకున్నాయి. రేపు ఈ సినిమాను లాంచ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణను బోయపాటి కలవాలని అనుకుంటున్నాడట.

పెద్ద బ్యానర్లో ఒక స్టార్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ బోయపాటికి వచ్చిందట. బాలకృష్ణకి ఒక మాట చెప్పేసి, తన తాజా ప్రాజెక్టును మొదలుపెట్టాలనే ఉద్దేశంతో బోయపాటి వున్నాడని అంటున్నారు. అవకాశం వచ్చేసింది కదా అని వేరే ప్రాజెక్టును మొదలెట్టేస్తే, బాలకృష్ణతో వున్న అనుబంధం దెబ్బతింటుందని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు. బాలకృష్ణను కలవడం వలన ఆ తరువాత సినిమా అయినా తనతో వుందో లేదో అనే విషయంలో బోయపాటికి క్లారిటీ వచ్చేస్తుందన్న మాట. 
Balakrishna
boyapati

More Telugu News