Kutumbarao: మోదీ కూడా 'మహర్షి' సినిమాలోని విలన్‌లా బాధపడుతున్నారట: కుటుంబరావు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధికార ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో  మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమాకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఈ సినిమా ప్రస్తావనను తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ పరిస్థితి ఆ సినిమాలోని విలన్‌లా తయారైందని అన్నారు.

సినిమాలోని విలన్ పాత్రధారి అయిన జగపతిబాబు చివర్లో ఆ ఒక్క ఊరి జోలికి వెళ్లకుంటే బాగుండేదని అనుకుంటాడని, ఇప్పుడు మోదీ కూడా ఏపీ జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేదని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.

కాగా, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు నిర్వహించాల్సిన మహానాడును వాయిదా వేశారు. అలాగే, లోక్‌‌సభ నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షలను నిలిపివేయాలని నిర్ణయించారు.
Go Back to Shorts
Kutumbarao
Maharshi
villian
Narendra Modi
Chandrababu

More Telugu News