TTD: తిరుమలలో భక్తులను మోసగిస్తున్న దళారీని పట్టుకున్న పోలీసులు

షార్ట్స్‌లో చూడండి
తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే వారిలో చాలామందికి స్థానిక స్థితిగతులపై అవగాహన కొరవడడంతో తేలిగ్గా దళారీల వలలో చిక్కుకుంటారు. అలాంటి అమాయకులను మోసగించి పబ్బం గడుపుకుంటున్న ఓ దళారీని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఎంతో సులభంగా దర్శనం కల్పిస్తానని, వసతి ఏర్పాటు చేస్తానని చెబుతూ భక్తులను మోసం చేస్తున్న ఆ దళారీని గుంటూరుకు చెందిన కార్తీక్ గా గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కార్తీక్ తో పాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
TTD
Tirumala

More Telugu News