నా తప్పుంటే చట్టపరమైన చర్య తీసుకోండి.. ఎదుర్కోవడానికి రెడీ!: గౌతమ్ గంభీర్
- మహిళలను గౌరవించే కుటుంబం నుంచి వచ్చా
- కేజ్రీవాల్ ఇంతకు దిగజారతారని అనుకోలేదు
- తప్పుడు ఆరోపణలని తేలితే క్షమాపణ చెప్పాలి
అతిషి చేసిన ఆరోపణలను గంభీర్ తీవ్రంగా ఖండించారు. మహిళలను అత్యంత గౌరవంగా చూసే కుటుంబం నుంచి తాను వచ్చానని, సీఎం కేజ్రీవాల్ ఈ స్థాయికి దిగజారుతారని అనుకోలేదన్నారు. మీ ఆరోపణల్లో నిజముందని భావించినా, అందుకు తగిన ఆధారాలున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చన్నారు. తాను వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని తేలితే వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో వారిపై పరువు నష్టం దావా వేస్తానని గంభీర్ హెచ్చరించారు.