మళ్లీ జన్మంటూ వుంటే పూరి జగన్నాథ్ లా పుట్టాలని వుంది: వినాయక్
Add ap7am to your home Screen

మళ్లీ జన్మంటూ వుంటే పూరి జగన్నాథ్ లా పుట్టాలని వుంది: వినాయక్

  • రాజమౌళి ఇంటికి వెళుతుంటాను 
  • వాళ్లంతా చాలా ఆప్యాయత చూపిస్తారు
  •  పూరిలో భయం - టెన్షన్ కనపడవు   
తెలుగు తెరపై మాస్ యాక్షన్ తో కూడిన కామెడీ సినిమాలను పరుగులు తీయించిన దర్శకుడిగా వినాయక్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన దర్శకత్వం వహించిన 15 చిత్రాలలో చాలావరకూ బ్లాక్ బస్టర్ హిట్సే కనిపిస్తాయి. అలాంటి వినాయక్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజమౌళి .. పూరి జగన్నాథ్ ను గురించి ప్రస్తావించారు.

"నేను .. రాజమౌళి .. పూరి చాలా స్నేహంగా ఉంటాము. రాజమౌళిగారి ఇంటికి నేను వెళితే వాళ్లంతా చాలా హడావిడి చేస్తారు .. వాళ్లలోని ఆ ఆప్యాయత నాకు ఇష్టం. అందరం కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటాము. ఎప్పుడైనా కాస్త 'డల్' గా అనిపించినప్పుడు పూరిని కలుసుకోవాలనిపిస్తుంది. 'కాల్ చేసి బిజీగా ఉన్నావా?' అని అడిగితే .. 'ముందు వచ్చేసేయ్' అంటాడు. ఎలాంటి భయం .. టెన్షన్ లేకుండా ఆయన బిందాస్ గా ఉంటాడు. అంత స్వేచ్ఛ గా వుండే ఆయనని చూసినప్పుడు, మళ్లీ వచ్చే జన్మంటూ వుంటే పూరిలా పుట్టాలనిపిస్తుంది" అని చెప్పుకొచ్చారు. 
vinayak
rajamouli
puri

More Telugu News