బ్యాడ్ న్యూస్ అని చెప్పగానే మహేశ్ బాబు కంగారుపడిపోయారు: 'పీవీపీ' అధినేత వరప్రసాద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్యాడ్ న్యూస్ అని చెప్పగానే మహేశ్ బాబు కంగారుపడిపోయారు: 'పీవీపీ' అధినేత వరప్రసాద్

  • వారం కిందటే మహర్షి చిత్రాన్ని చూశాను
  • ఇలాంటి హిట్ మీరు కొట్టలేరండీ ఇదే మీకు బ్యాడ్ న్యూస్ అన్నాను
  • మహేశ్ బాబు కెరీర్లో ఇంతకంటే ముచ్చటైన చిత్రం మరొకటి ఉండదు
మహేశ్ బాబు కెరీర్ లో 25వ చిత్రంగా ఎంతో ప్రాముఖ్యత సంపాదించుకున్న మహర్షి చిత్రం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన 'పీవీపీ' అధినేత వరప్రసాద్ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఆయన మహర్షి చిత్రాన్ని విజయవాడలోని తన సొంత థియేటర్ పీవీపీ మాల్ లో సాధారణ ఆడియన్స్ తో కలిసి వీక్షించారు. సినిమా అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ సినిమాను వారం కిందట కూడా చూశానని, అప్పుడు మహేశ్ బాబుకు ఫోన్ చేసి మీకు బ్యాడ్ న్యూస్ అనగానే ఎంతో కంగారుపడిపోయారని గుర్తుచేసుకున్నారు.

బ్యాడ్ న్యూస్ అంటున్నారేంటి? అంటూ మహేశ్ బాబు ఒకింత ఆందోళనగానే అడిగారని, అందుకు తాను బదులిస్తూ, ఈ సినిమాను మించిన హిట్ మీరు ఎప్పటికీ కొట్టలేరు, అదే మీకు బ్యాడ్ న్యూస్ అని చెప్పానని పీవీపీ వివరించారు. మీ కెరీర్ లో తిరుగులేని బ్లాక్ బస్టర్, ఇది గుడ్ న్యూస్ అనేసరికి ఆయన రిలీఫ్ గా ఫీలయ్యారని పీవీపీ చెప్పారు.

కాగా, ఈ సినిమా స్టోరీలైన్ ను మూడేళ్ల కిందటే దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేశ్ బాబుకు చెప్పించానని, కథ నచ్చడంతో తనతోపాటు దిల్ రాజు, అశ్వనీదత్ కూడా ప్రొడ్యూసర్లుగా చేయి కలిపారని పీవీపీ వెల్లడించారు. మహేశ్ బాబు కెరీర్లో ఇంతకంటే ముచ్చటైన చిత్రం మరొకటి ఉండదని అన్నారు.
PVP
Mahesh Babu
Maharshi

More Telugu News