ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లేకపోయినా హిట్లు కొట్టడం నా వల్లనే అయింది: సీనియర్ హీరోయిన్ జమున
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లేకపోయినా హిట్లు కొట్టడం నా వల్లనే అయింది: సీనియర్ హీరోయిన్ జమున

  • మూడేళ్లపాటు ఎన్టీఆర్ .. ఏఎన్నార్ తో చేయలేదు 
  • ఆ సమయంలో మొత్తం 18 సినిమాలు చేశాను 
  • ఆ మూడేళ్లలో 15 హిట్లు కొట్టాను
తెలుగు తెరపై ఆంధ్రా డ్రీమ్ గాళ్ గా జమున ఒక వెలుగు వెలిగారు. అలాంటి జమున ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో కలిసి మూడేళ్లపాటు నటించలేదు. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గురించి జమున మాట్లాడుతూ, "ప్రతి స్త్రీ తన వ్యక్తిత్వాన్నీ .. ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలనుకుంటుంది. అలాంటి ధోరణిని కొంతమంది మగవాళ్లు సహించలేరు. అయినా వాళ్లను ఎదుర్కునే గుండె ధైర్యం ఆ స్త్రీకి ఉండాలి.

ఆ ధైర్యంతోనే కెరియర్ పరంగా నేను ముందుకు సాగాను. ఆ మూడేళ్లలో జగ్గయ్య .. హరనాథ్ వంటి హీరోలతో నేను నటించాను. మొత్తంగా చూసుకుంటే ఆ సమయంలో నేను 18 నుంచి 20 సినిమాలు చేశాను. వాటిలో 15 సినిమాలు హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లేకున్నా జమున ఇన్ని హిట్లు కొట్టేసి నిలబడగలగడం గొప్ప విషయమని అప్పట్లో అంతా చెప్పుకున్నారు" అంటూ జమున అన్నారు. 
ntr
anr
jamuna

More Telugu News