modi: మోదీని దుర్యోధనుడు అని కాదు.. అంతకన్నా తీవ్రమైన భాషలో విమర్శించాలి: రబ్రీదేవి

  • మోదీ, అమిత్ షాలు అత్యంత క్రూరులు
  • జడ్జిలు, మీడియా వాళ్లను చంపే వ్యక్తులు
  • అబద్ధాలతో జనాలను మోసం చేస్తున్నారు
ప్రధాని మోదీని దుర్యోధనుడంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. దుర్యోధనుడికి ఉన్న అహంకారమే మోదీలో ఉందని... దురహంకారమే దుర్యోధనుడి పతనానికి కారణమైందని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు, ప్రియాంక వ్యాఖ్యలపై బీహార్ మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవి స్పందిస్తూ... మోదీని దుర్యోధనుడు అని కాదు, అంతకన్నా తీవ్రమైన భాషలో విమర్శించాలని అన్నారు. మోదీ, అమిత్ షాలు అత్యంత క్రూరమైన వ్యక్తిత్వం కలవారని... న్యాయమూర్తులు, మీడియా వాళ్లను కూడా చంపే మనుషులని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్ దాడులు, అభివృద్ధి పేరుతో అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
modi
amit shah
priyanka gandhi
rabri devi

More Telugu News