నేను అప్పుడు దర్శకుడు సాగర్ గారి దగ్గర అసిస్టెంటును .. నా కోసం ఆయన కిందపడుకున్నాడు: వీవీ వినాయక్
Add ap7am to your home Screen

నేను అప్పుడు దర్శకుడు సాగర్ గారి దగ్గర అసిస్టెంటును .. నా కోసం ఆయన కిందపడుకున్నాడు: వీవీ వినాయక్

  • దర్శకుడు సాగర్ గారు ఎంతో మంచివారు
  •  నన్ను ఎప్పుడూ అసిస్టెంట్ లా చూడలేదు
  • ఎంతో ప్రేమగా నన్ను చూసుకునేవారు 
తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ, తన కెరియర్ ఆరంభంలోని విషయాలను గురించి ప్రస్తావించారు. "దర్శకుడు సాగర్ గారి దగ్గర నేను అసిస్టెంట్ గా చేసేవాడిని. ఆయన చాలా మంచివారు .. ఎంతమంచివారంటే, కార్లో వెళుతూ నిద్రలోకి జారుకుని ఆయన భుజంపై నా తలను ఆనిస్తే, నేను ఎక్కడ లేస్తానోనని ఆయన కదలకుండా అలాగే కూర్చునేవారు.

 వృత్తిపరంగా నాకు గల అంకితభావం .. నేను పడే కష్టం .. నేను పెట్టే శ్రద్ధ సాగర్ గారికి తెలుసు. ఆయన దర్శకుడు .. నేను ఆయన అసిస్టెంట్ ను. నేను ఎప్పుడైనా బెడ్ పై పడుకుని నిద్రపోతే .. నన్ను లేపకుండా ఆయన కింద పడుకునేవారు. ఇది ఎవరి విషయంలో జరగదు .. నమ్మరు కూడా. నన్ను అంతగా ప్రేమించేవారు .. గౌరవించేవారు" అంటూ చెప్పుకొచ్చారు. 
vv vinayak

More Telugu News