అలా చేసినందుకు రాఘవేంద్రరావుగారు క్లాస్ పీకారు: మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలా చేసినందుకు రాఘవేంద్రరావుగారు క్లాస్ పీకారు: మహేశ్ బాబు

  • పరుచూరి బ్రదర్స్ కథ చెబుతున్నారు 
  • నేను రబ్బర్ బ్యాండ్ తో ఆడుతున్నాను 
  • రాఘవేంద్రరావు గారు ఆ మాట అన్నారు 
మహేశ్ బాబు కథానాయకుడిగా చేసిన 'మహర్షి' ఈ నెల 9వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ బాబు బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన తొలి సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.

"ఓ రోజున పరుచూరి బ్రదర్స్ వచ్చి నాకు .. రాఘవేంద్రరావుగారికి 'రాజకుమారుడు' కథ చెబుతున్నారు. వాళ్లు కథ చెప్పుకుంటూ వెళుతుంటే, రాఘవేంద్రరావుగారి టేబుల్ పై వున్న రబ్బర్ బ్యాండ్ తో నేను ఆడుతున్నాను. పరుచూరి బ్రదర్స్ కథ చెప్పేసి వెళ్లిపోయారు. వాళ్లు అలా వెళ్లగానే .. "కథ నచ్చకపోయినా నచ్చినట్టుగా బిహేవ్ చేయాలనీ, రబ్బర్ బ్యాండ్ తో ఆడుకోవడం లాంటివి చేస్తే రచయితల .. దర్శకుల కాన్ఫిడెన్స్ పోతుందని అన్నారు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలా చేయకు" అని క్లాస్ పీకారు. ఈ సంఘటన నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది .. అప్పటి నుంచి నన్ను నేను మార్చుకున్నాను" అని చెప్పుకొచ్చాడు. 
Mahesh Babu
raghavendra rao

More Telugu News