'ఎర్రగడ్డకు దారేది' పేరిట త్వరలోనే వర్మ జీవితంపై బయోపిక్ తీస్తా!: దేవీబాబు
- వర్మపై నిప్పులు చెరిగిన దేవీబాబు
- వాడైనా చావాలి, లేదా నేనైనా
- ఊరకుక్క అరిస్తే ఎలా ఉంటుందో వర్మ అరిస్తే అలా ఉంటుంది
చంద్రబాబునాయుడ్ని ఎవరు అవమానించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. "ఒరే వర్మా! నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తా" అంటూ మండిపడ్డారు. వర్మ అఖిల భారత పిచ్చ సంఘం అధ్యక్షుడని, ఊరకుక్క అరిస్తే ఎలా ఉంటుందో వర్మ అరిస్తే అలా ఉంటుందని విమర్శించారు. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని జగన్ కోసం తీశారని, వర్మకు పిచ్చెక్కడంతోనే అనేక విధాల బయోపిక్ లు తీస్తున్నారంటూ దేవీబాబు ఎద్దేవా చేశారు.
తాను త్వరలో వర్మ జీవితం ఆధారంగా 'ఎర్రగడ్డకు దారేది' టైటిల్ తో ఓ బయోపిక్ తీస్తున్నానని వెల్లడించారు. వర్మ పిచ్చి ఏ స్థాయిలో ఉంటుందో తన చిత్రంలో చూడొచ్చని అన్నారు. వర్మపై తాను చేస్తున్న పోరాటం ఇప్పట్లో ఆగదని, "వాడైనా చనిపోవాలి లేక నేనైనా చావాలి" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.