Andhra Pradesh: ‘పోలవరం’ను సందర్శించనున్న చంద్రబాబు
ఏపీ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబునాయుడు సందర్శించనున్నారు. ఈ నెల 6 ఉదయం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ఆయన వెళ్లనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పనులు మందగించాయి. కాగా, ఈ జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లు అందించాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.