తుపాను సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి!: టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ సూచన
- ఆర్టీజీఎస్ ద్వారా ఫణిని సమీక్షిస్తున్నాం
- ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలి
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
ఫణి ప్రభావంతో విజయనగరం జిల్లా తీరప్రాంత మండలాల్లో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు ఉదయం 10 గంటలకు ఒడిసాలోని పూరీ వద్ద తుపాను తీరం దాటనుందని అన్నారు. దీనివల్ల ఈ రోజు అర్థరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తాయని సీఎం రమేశ్ చెప్పారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికారులను మోహరించామనీ, ప్రజలు భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఈ మేరకు సీఎం రమేశ్ ట్విట్టర్ లో స్పందించారు.