'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా సుకుమార్ కి మహేశ్ పంచ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా సుకుమార్ కి మహేశ్ పంచ్

  • నన్ను దృష్టిలో పెట్టుకునే వంశీ కథ రాశానన్నాడు
  •  ఎంతకాలమైనా నా కోసం వెయిట్ చేస్తానన్నాడు
  •  వంశీకి థ్యాంక్స్ చెబుతున్నాను  
మహేశ్ బాబు తాజా చిత్రంగా రూపొందిన 'మహర్షి' .. ఈ నెల 9వ తేదీన థియేటర్స్ కి రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై మహేశ్ బాబు మాట్లాడుతూ .. "వంశీ పైడిపల్లి నాకు ఈ కథ వినిపించినప్పుడు, ఈ కథను ఓకే చేస్తే చాలా కాలం పాటు వెయిట్ చేయవలసి వస్తుందని చెప్పాను. ఈ సినిమా కంటే ముందు రెండు సినిమాలు పూర్తిచేయవలసి ఉంటుందని అన్నాను.

'ఈ కథ మిమ్మల్ని ఊహించుకుని రాసింది .. ఎంత ఆలస్యమైనా ఫరవాలేదు వెయిట్ చేస్తాను' అన్నాడు. ఈ విషయంలో నీకెప్పుడూ రుణపడి వుంటాను వంశీ. ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గరైనా కథ వుంటే .. రెండు నెలలు ఆలస్యమైనా వేరే హీరో దగ్గరికి వెళ్లిపోతున్నారు. అలా కాకుండా నా కోసం రెండేళ్లు వెయిట్ చేశావు .. అందుకు నిజంగా థ్యాంక్స్" అని అన్నాడు. మహేశ్ తో ఒక కథ అనుకున్న సుకుమార్, ఆలస్యం అవుతుండటంతో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లిన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు పంచ్ వేసింది సుకుమార్ కేనని, ఫంక్షన్ కి వచ్చిన వాళ్లంతా చెప్పుకుంటున్నారు.
Mahesh Babu
vamsi paidipalli

More Telugu News