మహేశ్ చేతులు చాచి హగ్ అడిగారు... గ్రేట్ మూమెంట్: దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ చేతులు చాచి హగ్ అడిగారు... గ్రేట్ మూమెంట్: దిల్ రాజు

  • మూడు ప్రముఖ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన 'మహర్షి'
  • బుధవారం రాత్రి వైభవంగా ప్రీ రిలీజ్ వేడుక
  • 9వ తేదీన విడుదలకు సిద్ధం
దిల్‌ రాజు, అశ్వనీదత్ తో పాటు పలువురు ప్రముఖ నిర్మాతలు కలిసి మహేశ్ బాబు హీరోగా నిర్మించిన 'మహర్షి' చిత్రం ఈ నెల 9న విడుదలకు సిద్ధంకాగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, మూడు పెద్ద బ్యానర్లతో కలిసి మహేశ్ 25వ చిత్రాన్ని చేశామని, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాను ఇస్తున్నామన్న నమ్మకం ఉందని అన్నారు.

ఏ హీరోతో అయినా తాను సన్నిహితంగా ఉంటానని, సినిమా షూటింగ్ చివరి రోజున అందరికీ హగ్ ఇవ్వడం తనకు అలవాటని గుర్తు చేసుకున్న దిల్ రాజు, 'మహర్షి' షూటింగ్ చివరి రోజున తాను అందరికీ హగ్ ఇచ్చి, మహేశ్ కు ఇవ్వాలా? వద్దా? అన్న ఆలోచనలో వెళుతుంటే, ఆయనే స్వయంగా చేతులు చాపి 'నాకు హగ్ ఇవ్వరా?' అని అడిగారని, అదో గ్రేట్ మూమెంటని అన్నారు.

 'ఊపిరి' తరువాత వంశీ పైడిపల్లి ఈ కథను మహేశ్ వద్దకు తీసుకెళ్లారని, ఆపై మహేశ్ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు వంశీ కళ్లు చమర్చాయని అన్నారు. ఈ సినిమా క్లైమాక్స్ ను చూసి తనను తాను నియంత్రణలో ఉంచుకోలేకపోయానని, అంత అద్భుతంగా ఉందని చెప్పారు.
Maharshi
Dil Raju
Mahesh Babu
Pre Release

More Telugu News