నువ్వేంటి చెప్పేది వర్మా?... లక్ష్మీపార్వతి చరిత్ర ఏంటో ఆమె మొదటిభర్త ఎప్పుడో చెప్పారు!: దివ్యవాణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నువ్వేంటి చెప్పేది వర్మా?... లక్ష్మీపార్వతి చరిత్ర ఏంటో ఆమె మొదటిభర్త ఎప్పుడో చెప్పారు!: దివ్యవాణి

  • నీకు ఎన్టీఆర్ ఆత్మ వచ్చి చెప్పిందా?
  • లక్ష్మీపార్వతేమీ పదహారేళ్ల బాలాకుమారి కాదు
  • స్టెరాయిడ్స్ ఇచ్చి ఎన్టీఆర్ ను చంపేసింది
ఏపీలో ప్రెస్ మీట్ పెట్టడానికి విఫలయత్నం చేసి ఆపై సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ మహిళా నేత దివ్యవాణి నిప్పుల వర్షం కురిపించారు. సమస్యను సమస్యగా మాట్లాడడం వర్మ నేర్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది ఏమీ లేదని, లక్ష్మీపార్వతి చరిత్ర ఏంటో ఆమె మొదటిభర్త వీరగంథం గారు ఎప్పుడో చెప్పారని, ఇటీవలే కోటి అనే యువకుడు కూడా తాను ఎలా వేధింపులకు గురైందీ సోషల్ మీడియాలో వెల్లడించాడని దివ్యవాణి పేర్కొన్నారు.

"దయ్యాలు లేవు, దేవుళ్లు లేవు అనే వ్యక్తివి, ఎన్టీఆర్ ఆత్మ వచ్చి నాకు చెప్పింది, అందుకే సినిమా తీస్తున్నానంటూ నువ్వు కల్లబొల్లి కబుర్లు చెప్పడం, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న జగన్, స్క్రిప్టు రైటర్ గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి నీకు వంతపాడడం! ఏపీ ప్రజలేమీ అంత అమాయకులు కాదు. ఇతర రాష్ట్రాల్లో మీ సినిమా సంకనాకిపోయిందన్న సంగతి అందరికీ తెలుసు.

ఎన్టీఆర్ గారి జీవితంలోకి వచ్చే సమయానికి ఆమేమీ పదహారేళ్ల బాలాకుమారి కాదు. ఆమె కనీసం ఎన్టీఆర్ గారి వయసును కూడా గుర్తించకుండా స్టెరాయిడ్స్ ఇప్పించి చావుకు కారణమైంది. నారా వారి కుటుంబం, నందమూరి కుటుంబాలకు సంస్కారం ఉంది కాబట్టి ఆమె గురించి ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు. అయినా ఎన్టీఆర్ గురించి సినిమా తీయడానికి బూతు దర్శకుడివైన నీకేం అర్హత ఉంది?" అంటూ మండిపడ్డారు.
Divyavani
Chandrababu
RGV

More Telugu News