నీకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కుటుంబంలో హత్యారాజకీయాలపై సినిమా తీయాలి: వర్మకు సవాల్ విసిరిన దివ్యవాణి
- ఇంటర్ విద్యార్థుల చావులపై సినిమా తీసే దమ్ముందా?
- నీ స్థాయికి దేవీబాబు లాంటి వ్యక్తి కూడా ఎక్కువే
- దర్శకుడు ఎలా ఉండాలో ఇండస్ట్రీలో ఉన్న సీనియర్లను చూసి నేర్చుకో
"ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుస్తోంది చంద్రబాబునాయుడి గారి విలువేంటో. 20 మంది ఇంటర్ విద్యార్థుల బంగారు భవిష్యత్తును, వాళ్ల తల్లిదండ్రుల సంతోషాన్ని మళ్లీ తీసుకురాగలరా? ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఎంతమంది బిడ్డలు ఆహుతైపోయారు? మరి ఆ తప్పులపై నీకు సినిమాలు తీసే దమ్ముంటే అప్పుడు నిన్ను నిజమైన డైరెక్టర్ అంటాం. సినీ దర్శకుడు అంటే ఎలా ఉండాలో ఇండస్ట్రీలో ఉన్న అగ్రజులను చూసి నేర్చుకోండి.
నాకన్నా చంద్రబాబు పెద్ద రౌడీ అని అంటావా? అయ్యా వర్మా, నీ స్థాయికి దేవీబాబు లాంటి వ్యక్తి ఎక్కువ. నువ్వా చంద్రబాబునాయుడి గురించి మాట్లాడేది? అనవసరంగా మా నాయకుడ్ని ఒక్క మాట కూడా అనొద్దు, లేకుంటే తిరిగి మొహంపై ఉమ్మేయించుకునే విధంగా వంద మాటలు పడాల్సి ఉంటుంది, జాగ్రత్త! ఓ వైపు ఏపీలో 144 సెక్షన్ అమల్లో ఉంటే నువ్వేంటి ఇక్కడకొచ్చి మాట్లాడేది?" అంటూ దివ్యవాణి నిప్పులు చెరిగారు.