జగన్ గారు స్పందించడం చాలా సంతోషం కలిగించింది: వర్మ
- ఓ వ్యక్తిగా ఆయన స్పందించారు
- ప్రజాస్వామ్యం పట్ల అందరూ అలాగే ముందుకు రావాలి
- పోలీసులపై జగన్ వ్యాఖ్యలను ప్రస్తావించిన వర్మ
ఓ టీవీ చానల్ స్టూడియోలో కూర్చున్న వర్మ దీనిపై మాట్లాడుతూ, "ఆయన వైసీపీనా, మరో పార్టీకి చెందిన వ్యక్తా అని కాదు, ప్రజాస్వామ్యానికి భంగం కలిగినప్పుడు ఓ వ్యక్తిగా తను స్పందించారు. అది సంతోషించాల్సిన విషయం. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ అలాగే ముందుకు రావాలి" అంటూ పేర్కొన్నారు.
పోలీసులను బంట్రోతులుగా ఉపయోగించుకుంటున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా వర్మ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తనలాంటి వాడ్ని మరో చోటికి తరలించడానికి అంత పోలీస్ ఫోర్స్ అవసరమా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.