పోలింగ్ కేంద్రంలో నాటు బాంబు కలకలం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు!
- పశ్చిమబెంగాల్ లోని శాంతిపూర్ లో ఘటన
- ఓ పోలింగ్ కేంద్రంలో నాటు బాంబు దర్శనం
- దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేసిన అధికారులు
అనంతరం బాంబు స్క్వాడ్ కు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు బాంబును జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పశ్చిమబెంగాల్ పోలీసులు.. అసలు పోలింగ్ బూత్ లోకి బాంబు ఎలా వచ్చిందన్న విషయమై దర్యాప్తు చేస్తున్నారు.