ఇంటర్ విద్యార్థిని నవ్యకు సున్నా మార్కులు వేసిన తెలుగు లెక్చరర్ పై చర్యలు
Add ap7am to your home Screen

ఇంటర్ విద్యార్థిని నవ్యకు సున్నా మార్కులు వేసిన తెలుగు లెక్చరర్ పై చర్యలు

  • విధుల నుంచి తొలగించిన శ్రీనారాయణ జూనియర్ కాలేజి
  • రూ.5000 జరిమానా చెల్లించిన లెక్చరర్
  • 99 మార్కులకు బదులు సున్నా మార్కులు వేసిన వైనం
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మార్కుల మంటలు ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థిని నవ్యకు సున్నా మార్కులు వేసిన తెలుగు లెక్చరర్ పై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమెను విధుల నుంచి తొలగిస్తూ శ్రీనారాయణ జూనియర్ కాలేజి నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా, ఇంటర్ బోర్డు ఆ అధ్యాపకురాలికి రూ.5000 జరిమానా విధించింది. ఆ జరిమానాను సదరు లెక్చరర్ వెంటనే చెల్లించినట్టు సమాచారం.

పరీక్ష పేపర్ల మూల్యాంకనం స్క్రూటినైజర్ విజయ్ కుమార్ పైనా సస్పెన్షన్ వేటు పడింది. నవ్యకు తెలుగు సబ్జెక్టులో 99 మార్కులకు బదులు సున్నా మార్కులు రావడం ఇంటర్ ఫలితాల అవకతవకలకు పరాకాష్ఠగా చెప్పాలి.
Telangana

More Telugu News