రీ వాల్యుయేషన్ లో మార్కులు పెరిగితే రుసుము వెనక్కి.. తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం
- మరో కీలక నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు
- విద్యార్థుల మేలు కోసమే
- వెల్లడించిన విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి
ప్రస్తుతం తాము రాసిన ఆరు పేపర్ల పునఃపరిశీలనకు విద్యార్థులు రూ. 3 వేలు చెల్లిస్తున్నారు. ఒకవేళ మార్కులు పెరిగినా, ఇప్పటివరకూ చెల్లించిన డబ్బును వెనక్కు ఇచ్చే పరిస్థితి లేదు. మార్కులు పెరిగితే, తొలిసారిగా దాన్ని దిద్దిన అధ్యాపకుడు చేసిన తప్పు తీవ్రతను బట్టి రూ. 2 వేల నుంచి రూ. 20 వేల వరకూ జరిమానా విధిస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరమూ రీ వాల్యుయేషన్ కు 18 నుంచి 20 వేల వరకూ దరఖాస్తులు వస్తుండగా, ఈ సంవత్సరం ఇప్పటికే 75 వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం.