Telangana: ‘గ్లోబరినా’ను కాపాడేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి యత్నం: ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపణ

షార్ట్స్‌లో చూడండి
గ్లోబరినా సంస్థను కాపాడేందుకు ఇంటర్ బోర్డు కార్యదర్శి యత్నిస్తున్నారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. హైదరాబాద్ లోని టీజేఎస్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోవాలని, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, విద్యాశాఖ మంత్రి బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇంత జరుగుతున్నా ప్రభుత్వం బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టుపై మాత్రమే దృష్టి సారిస్తే సరిపోతుందని, ఇంటర్ బోర్డు, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చి హైకోర్టును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ పెద్దలు ముగ్గురు ఈ సమస్యకు బాధ్యులని, సమస్యల పరిష్కారానికి ఇంటర్ బోర్డు కార్యాలయానికి వస్తే అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Telangana
Intermediate
Globarina
prof.kodandaram

More Telugu News