ఉప్పొంగిన ‘కాళేశ్వరం’.. వెట్ రన్ విజయవంతం!
- తొలి మోటార్ ను ప్రారంభించిన అధికారులు
- ఉవ్వెత్తున ఎగజిమ్మిన నీరు
- నందిమేడారం నుంచి నీటి ఎత్తిపోత
తొలుత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం అధికారులు మోటర్ ను ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా నీళ్లు ఉవ్వెత్తున ఎగజిమ్మాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్న అధికారులు, స్థానికులు సంతోషం పట్టలేక కేకలు, ఈలలు వేశారు. నందిమేడారం సర్జ్ పూల్ లో ఉన్న నీటిని ఈ మోటార్లు ఎత్తిపోస్తున్నట్లు అధికారులు తెలిపారు.