సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఎన్టీఆర్ కు జోడీగా పరిణీతి చోప్రా?   
  • 'జెర్సీ' భామతో చైతూ సినిమా 
  • మళ్లీ కెమెరా ముందుకు శ్రుతి
*  రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే నాయిక ఎవరన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ను ప్రయత్నించినప్పటికీ, ఆమె డేట్స్ సమస్యతో చేయలేకపోతోందట. దాంతో మరో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రాను ట్రై చేస్తున్నట్టు తాజా సమాచారం.  
*  ఇటీవల 'మజిలీ'తో హిట్ కొట్టి, ప్రస్తుతం 'వెంకీమామ' చిత్రాన్ని చేస్తున్న నాగ చైతన్య త్వరలో దిల్ రాజు బ్యానర్లో మరో చిత్రాన్ని చేయనున్నాడు. నూతన దర్శకుడు శశి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో 'జెర్సీ' ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.
*  గత కొంత కాలంగా నటనకు దూరంగా వున్న అందాలతార శ్రుతిహాసన్ ఇప్పుడు ఓ తమిళ చిత్రంలో నటిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించే 'లాభం' చిత్రంలో నాయికగా ఆమె నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ నిన్ననే చెన్నైలో మొదలైంది.
Parinithi
NTR
Rajamouli
Chaitanya

More Telugu News