'టైగర్ కేసీఆర్' చిత్రం ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకం కాదు, కొందరు ఆంధ్రా నేతలకు మాత్రమే వ్యతిరేకం: రామ్ గోపాల్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'టైగర్ కేసీఆర్' చిత్రం ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకం కాదు, కొందరు ఆంధ్రా నేతలకు మాత్రమే వ్యతిరేకం: రామ్ గోపాల్ వర్మ

  • తెలంగాణ ద్రోహులైన ఆంధ్రా నేతలతోనే కేసీఆర్ పోరు‌
  • కేసీఆర్ తెలుగు ప్రజలను ఎంతో ప్రేమించారు
  • ట్వీట్ చేసిన వర్మ
సంచలనాలకు మారుపేరుగా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడాయన టైగర్ కేసీఆర్ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుంచే ఆసక్తి కలిగిస్తోంది. అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్, ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు అనే సబ్ క్యాప్షన్ కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి. అయితే, తన సినిమా ఆంధ్రులకు వ్యతిరేకం కాదని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

 "టైగర్ కేసీఆర్ చిత్రాన్ని ఆంధ్రులకు వ్యతిరేకంగా తెరకెక్కించడంలేదు. ఇది కేవలం కొందరు ఆంధ్రా నేతలకు వ్యతిరేకంగా ఉంటుంది. తెలంగాణ ప్రజలను కష్టాల కడగండ్లలోకి నెట్టిన కొందరు ఆంధ్రా పాలకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీస్తున్నాం. కేసీఆర్ తెలుగు ప్రజలను ఎంతో ప్రేమించారు. తెలంగాణ ప్రజలను వంచించి నమ్మకద్రోహం చేసిన ఆంధ్రా నాయకుల మీదే ఆయన పోరాటం సాగించారు" అంటూ ట్వీట్ చేశారు.
KCR
RGV

More Telugu News