కేసీఆర్ బయోపిక్ లో ఉండేది వీళ్లే.. ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ బయోపిక్ లో ఉండేది వీళ్లే.. ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ!

  • ‘టైగర్ కేసీఆర్’గా తెరకెక్కుతున్న సినిమా
  • చంద్రబాబు, లోకేశ్, లగడపాటి, ఉండవల్లి
  • ఈరోజు 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితంపై ‘టైగర్ కేసీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వర్మ మరో కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాలో కేసీఆర్ తో పాటు కేటీఆర్, కవిత, హరీశ్ రావు, వైఎస్సార్, జగన్, చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్ ఉంటారని తెలిపారు.

వీరితో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ సీఎంలు రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ఉంటారని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తానని పేర్కొన్నారు.
KCR
biopic
RGV

More Telugu News