ఉత్తరప్రదేశ్ లో 1.24 లక్షల లీటర్ల బీరును రోడ్డుపై పారబోసిన అధికారులు!
- యూపీలోని నోయిడాలో ఘటన
- మద్యం నిల్వలపై అధికారులకు సమాచారం
- ఓ గోదాములో భారీగా మద్యం నిల్వలు స్వాధీనం
నోయిడాలోని ఓ గోదాములో భారీగా మద్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. అనంతరం తనిఖీలు చేపట్టగా, మూడు కోట్ల రూపాయల విలువైన 11,652 బీర్ బాటిళ్లు దొరికాయి. అయితే వీటిలోని బీర్ కాలపరిమితి ముగిసిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో మొత్తం బాటిళ్లను ఒకేచోట పారబోసి, బుల్ డోజర్లతో తొక్కించారు.