కాంగ్రెస్ నేత వీహెచ్ అనూహ్య నిర్ణయం.. రేపు కాకినాడలో ధర్నా!
- ఇంద్రపాలెం, అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా
- తెలంగాణలో అంబేద్కర్ కు అవమానం జరిగింది
- ఆ విషయం ఏపీ ప్రజలకు తెలిపేందుకే ధర్నా
ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతామని అన్నారు. ఇదే సమయంలో ఈసీపైనా ఆరోపణలు చేసిన వీహెచ్, ఇష్టానుసారం అధికారులను బదిలీ చేస్తున్న ఈసీ ఓవరాక్షన్ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఎవరిపై దాడి చేయమంటే, వారిపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని అన్నారు. ఇండియాలోని స్వతంత్ర వ్యవస్థలను నరేంద్ర మోదీ భ్రష్టు పట్టించారని వీహెచ్ ఆరోపించారు.