నెత్తురోడిన ఛత్తీస్ గఢ్.. ఇద్దరు మావోలను కాల్చిచంపిన భద్రతాబలగాలు!
- ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో ఘటన
- ధనికార్కా అడవుల్లో కూంబింగ్
- ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు
పోలింగ్ నేపథ్యంలో జిల్లా రిజర్వు గార్డులు దంతెవాడలోని ధనికార్కా అడవుల్లో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతాబలగాలకు, మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో బలగాలు సురక్షితంగా బయటపడ్డాయి. పరారైన మావోలను ఏరివేసేందుకు ఉన్నతాధికారులు కూంబింగ్ ను ముమ్మరం చేశారు.