రెండో భార్యగా వస్తావా? చావమంటావా?: మరదలిని హింసిస్తున్న బావకు అరదండాలు
- తనను పెళ్లి చేసుకోవాలంటూ మరదలికి వేధింపులు
- మిత్రుల సాయంతో బాధితురాలిపై ఒత్తిడి
- బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
తనను పెళ్లి చేసుకోవాలని, తనకు రెండో భార్యగా రావాలని వేధించసాగాడు. ఇటీవల మరింత ముందుకెళ్లి తనను పెళ్లాడకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించసాగాడు. అతడి మిత్రులైన మెజెస్, సోను, సాయికుమార్‌లు కూడా అతడికి వత్తాసు పలికారు. బాధితురాలిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆదివారం మరోమారు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు. అతడి ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతుండడంతో ఇక లాభం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాకబ్‌ను అదుపులోకి తీసుకున్నారు.