శ్రద్ధా కపూర్ ను ఒప్పించే ప్రయత్నంలో 'ఆర్ ఆర్ ఆర్' టీమ్
Add ap7am to your home Screen

శ్రద్ధా కపూర్ ను ఒప్పించే ప్రయత్నంలో 'ఆర్ ఆర్ ఆర్' టీమ్

  • ఎన్టీఆర్ జోడీ కోసం అన్వేషణ
  •  తెరపైకి శ్రద్ధా కపూర్ పేరు
  •  హిందీ సినిమాలతో బిజీగా శ్రద్ధా   
హిందీలోని స్టార్ హీరోయిన్స్ జాబితాలో శ్రద్ధా కపూర్ ఒకరుగా కనిపిస్తుంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఈ సుందరికి వంకబెట్టవలసిన అవసరం లేదు. అలాంటి శ్రద్ధా కపూర్ .. 'సాహో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సినిమా తరువాత తెలుగులో ఆమె 'ఆర్ ఆర్ ఆర్' మూవీలో చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నాయికగా డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దాంతో శ్రద్ధా కపూర్ ను గానీ .. పరిణితీ చోప్రాను గాని తీసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. పాత్రపరంగా శ్రద్ధా కపూర్ అయితేనే సెట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నాడట. అయితే ఆమె 'చిచ్చోరే' .. 'స్ట్రీట్ డాన్సర్' సినిమాలు కూడా సెట్స్ పై వున్నాయి. అయినా డేట్స్ సర్దుబాటు చేయించి .. ఈ సినిమాకి తీసుకురావాలనే దిశగా రాజమౌళి సినిమా టీమ్ ప్రయత్నాలు చేస్తోందట. ఈ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.
ntr
charan
aliya bhat
shraddha

More Telugu News