పీకే కుట్రల కోసం వైసీపీ రూ. 300 కోట్లు ఖర్చు చేసింది: దేవినేని ఉమ
- టీడీపీదే గెలుపని పీకే టీమ్ చెబుతోంది
- కుట్రలు చేసి మోదీ, కేసీఆర్, జగన్ గెలవాలనుకున్నారు
- కేసీఆర్, కవితలు జగన్ కు ముద్దయ్యారు
పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తైతే ఇంకా పునాదులు కూడా వేయలేదని జగన్ మట్లాడుతున్నారని దేవినేని మండిపడ్డారు. జగన్ ఒక్కసారి కూడా పోలవరం ప్రాజెక్టును, అమరావతిని సందర్శించలేదని చెప్పారు. పోలవరంను ఆపేందుకు సుప్రీంకోర్టులో కేసులు వేసిన కేసీఆర్, కవితలు జగన్ కు ముద్దయ్యారని విమర్శించారు. పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు వైసీపీ చేసిన కుట్రలు ఫలించలేదని... ఆ పార్టీ కుట్రలను మహిళలు తిప్పికొట్టారని అన్నారు.