రాజమౌళి సినిమాకి అలియా భట్ పారితోషికం 5 కోట్లు!
- బాలీవుడ్లో అలియాకి భారీ క్రేజ్
- రాజమౌళి సినిమాలో చరణ్ జోడీగా
- త్వరలోనే షూటింగుకు హాజరు
ఈ సినిమా కోసం ఆమెకి అందే పారితోషికం ఎంతనే విషయంలో అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. అక్షరాలా ఆమెకి ముట్టజెప్పే పారితోషికం 5 కోట్లు అని తెలుస్తోంది. అలియా భట్ కి సంబంధించిన టీమ్ ఖర్చులు .. స్టార్ హోటల్లో బస ఖర్చులు .. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కాకుండా ఆమె పారితోషికాన్ని 5 కోట్లుగా ఫిక్స్ చేశారని చెప్పుకుంటున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్స్ 3 సినిమాలకి కలిపి అందుకునే పారితోషికం ఇది .. అలియా భట్ కి గల క్రేజ్ అలాంటిది మరి.