ఎన్టీఆర్ .. చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ ప్రభాస్ వాయిస్ ఓవర్
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ .. చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ ప్రభాస్ వాయిస్ ఓవర్

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • కొత్తగా ప్లాన్ చేసిన రాజమౌళి
  •  ప్రభాస్ అభిమానులకు శుభవార్త     
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ నిర్మితమవుతోంది. స్వాతంత్య్రం రాకమునుపు జరిగిన కథలో .. విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ - చరణ్ కనిపించనున్నారు. ఈ ఇద్దరి అభిమానులు కూడా ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా విడుదల కోసం వేయికళ్లతో ఎదురుచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమాలో భాగం కాబోతున్నాడు. 

ఎన్టీఆర్ .. చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ ప్రేక్షకులను అసలు కథలోకి తీసుకెళతారట. ఈ రెండు పాత్రలను గురించిన వాయిస్ ఓవర్ రాజమౌళి సిద్ధం చేయించాడని సమాచారం. ఈ వాయిస్ ఓవర్ ను ప్రభాస్ తో చెప్పిస్తే మరింత జనరంజకంగా ఉంటుందనీ, సినిమాకి మరో అదనపు ఆకర్షణ అవుతుందని ఆయన భావించాడని అంటున్నారు. రాజమౌళి అడిగితే ప్రభాస్ కాదనడం జరగదు గనుక, ఆయన వాయిస్ ఓవర్ సినిమాలో ఉండటం ఖాయమేనని అనుకోవచ్చు. ప్రభాస్ అభిమానులకు ఇది శుభవార్తకాక మరేమవుతుంది?
ntr
charan
prabhas

More Telugu News