ఇంతవరకు ఒక్క పోస్ట్ కానీ, ఫొటో కానీ పెట్టలేదు... కానీ లక్షల సంఖ్యలో ఫాలోయర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంతవరకు ఒక్క పోస్ట్ కానీ, ఫొటో కానీ పెట్టలేదు... కానీ లక్షల సంఖ్యలో ఫాలోయర్లు

  • ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరిచిన ప్రభాస్
  • ఖాతాను ఫాలో అవుతున్న 7 లక్షల మంది అభిమానులు
  • 'సాహో' లుక్ ను మొదటగా పోస్ట్ చేస్తాడని సమాచారం
'బాహుబలి' సినిమాతో ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. దేశ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రభాస్ పేరు మారుమోగుతోంది. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ ఖాతా తెరిచాడు. ఇంత వరకు ఒక పోస్టింగ్ కానీ, ఫొటో కానీ షేర్ చేయలేదు. అయినప్పటికీ 7లక్షల మంది ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కు ఇదొక నిదర్శనం. మరోవైపు, తన తాజా చిత్రం 'సాహో'కు సంబంధించిన లుక్ ను ఇందులో మొదటగా పోస్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్ 15వ తేదీన రిలీజ్ కానుంది.
prabhas
instagram
tollywood

More Telugu News