ప్రభాస్, మహేశ్ లతో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్, మహేశ్ లతో 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్

  • సంచలన విజయం సాధించిన 'కేజీఎఫ్'
  • ప్రశాంత్ నీల్ పై యువ హీరోల దృష్టి
  •  ఉత్సాహం చూపుతోన్న బడా నిర్మాతలు
ప్రశాంత్ నీల్ .. ఇప్పుడు ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఈయన దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్' సంచలన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో హీరో యశ్ ను ప్రశాంత్ నీల్ చూపించిన తీరు అందరికీ విపరీతంగా నచ్చేసింది. దాంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయడానికి స్టార్ హీరోలు సైతం ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇక బడా నిర్మాతలు సైతం ప్రశాంత్ నీల్ దర్శకుడిగా తమ బ్యానర్లో ఒక సినిమా చేయాలని ట్రై చేస్తున్నారట.

ముఖ్యంగా యూవీ క్రియేషన్స్ వారు .. దిల్ రాజు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో హీరోగా ప్రభాస్ .. దిల్ రాజు బ్యానర్లో హీరోగా మహేశ్ బాబు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకుడిగా ఈ రెండు ప్రాజెక్టులలో ముందుగా ఎవరి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో చూడాలి మరి. 
prabhas
mahesh

More Telugu News