రష్మిక మందనకు అభిమాని నుంచి అందమైన ప్రేమలేఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్మిక మందనకు అభిమాని నుంచి అందమైన ప్రేమలేఖ

  • అందమైన మీ నవ్వుంటే ఇష్టం 
  • మీ గురించి ఆలోచించకుండా ఉండలేను
  •  ప్రేమకి భాష అవసరమేగానీ అడ్డంకి కాదు    
 తెలుగు .. కన్నడ భాషల్లో కథానాయికగా రష్మిక మందన వరుస విజయాలతో దూసుకుపోతోంది. సినిమా .. సినిమాకి ఆమె అభిమానుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా ఒక అభిమాని ఆంగ్లంలో ఆమెకి రాసిన ప్రేమలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

"రష్మిక గారు .. మీరంటే నాకు పిచ్చి అభిమానం. మీ అందం .. నవ్వు .. అభిమానుల పట్ల మీరు చూపే గౌరవం నన్ను మీ అభిమానిగా మార్చేశాయి. ఈ భూమ్మీద నేను మిమ్మల్ని ఇష్టపడినంతగా మరెవరూ ఇష్టపడలేరేమో. నా హృదయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. తొలిసారిగా మిమ్మల్ని తెరపై చూసినప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను .. చదువుపై దృష్టిపెట్టలేకపోతున్నాను. నాకు తెలుగు .. కన్నడ భాషలు తెలియవు. ప్రేమకి భాష అవసరమేకానీ .. అడ్డంకి కాదు అనే విషయం మరోమారు రుజువైంది" అని ఆ యువకుడు రాసుకొచ్చాడు.
rashmika

More Telugu News