'డియర్ కామ్రేడ్' నుంచి మనసుకు హత్తుకునే మెలోడీ
Add ap7am to your home Screen

'డియర్ కామ్రేడ్' నుంచి మనసుకు హత్తుకునే మెలోడీ

  • భరత్ కమ్మ నుంచి 'డియర్ కామ్రేడ్'
  • సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్
  • మే 31వ తేదీన సినిమా విడుదల  
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' సినిమా రూపొందింది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "నీ నీలి కన్నుల్లోని ఆకాశమే .. తెల్లారి అల్లేసింది నన్నే .. నీ కాలి అందెల్లోని సంగీతమే సొక్కి .. నీ వైపే లాగేస్తోంది నన్నే .. " అంటూ ఈ పాట సాగుతోంది.

ప్రేయసి ప్రతి కదలిక అందమైన అనుభూతినే ఆవిష్కరిస్తోందంటూ ప్రియుడు పాడుకునే పాటగా ఇది తెరపైకి వస్తుంది. జోల పాటలా వినడానికి హాయిగా అనిపించే మెలోడీని జస్టిన్ ప్రభాకరన్ చాలా బాగా కంపోజ్ చేశాడు. రెహ్మాన్ సాహిత్యం .. గౌతమ్ భరద్వాజ్ ఆలాపన మనసుకు హత్తుకుంటున్నాయి. ఈ పాటకి ఫీల్ తో కూడిన విజువల్స్ తోడైతే, యూత్ హృదయాలను తేలికగా పట్టేస్తుందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో మెలోడీ పాటలకి మళ్లీ ఆదరణ పెరుగుతోందని చెప్పుకోవడానికి నిదర్శనంగా ఈ పాట వచ్చిందనే చెప్పుకోవచ్చు. మే 31వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
vijay devarakonda
rashmika

More Telugu News