నడిరోడ్డుపై యువకుడిని వెంబడించి కొట్టిన బాలకృష్ణ.. వీడియో వైరల్
- ఇటీవల ఓ జర్నలిస్టుపై నోరు పారేసుకున్న బాలయ్య
- చీపురుపల్లిలో బాలకృష్ణ ప్రచారం..
- అభిమాని ప్రవర్తనపై అనుమానాలు
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అక్కడి టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన బాలయ్య.. ఓ యువకుడిపై దాడి చేస్తుండగా చిత్రీకరించిన వీడియో ఇది. అభిమానిని పరిగెత్తించిన బాలకృష్ణ అతడిని పట్టుకుని కొట్టడం కనిపిస్తోంది. అయితే, బాలకృష్ణ ఆ అభిమానిపై చేయి చేసుకోవడానికి ముందు ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. బాలకృష్ణ వెంటపడి మరీ కొట్టాల్సినంత పెద్ద తప్పు అతడు ఏం చేశాడన్నది తెలియరాలేదు. కాగా, ఈ వీడియో కొంత అస్పష్టంగా ఉండడంతో బాలయ్యను పోలిన వ్యక్తి అన్న అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.