జగన్ గారూ.. రాజ్‌దీప్‌తో రాజధానిలో ఒక్క ఇటుక కూడా లేదన్నారుగా.. ఇది చూడండి: శివాజీ
- అద్భుతంగా సాగుతున్న రాజధాని నిర్మాణాన్ని చూపించిన శివాజీ
- సిద్ధమైన అధికారుల నివాస భవనాలు
- అబద్ధాలను పదేపదే ప్రచారం చేసినా ప్రజలు నమ్మబోరని జగన్‌కు హితవు
ఆ తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నివాసం కల్పించే భవన సముదాయాలను చూపించిన శివాజీ వాటికి రంగులు కూడా వేసి సిద్ధం చేస్తున్న దృశ్యాన్ని చూపించారు. జగన్ అధికారంలోకి వస్తే అద్భుతమైన ఈ రాజధానిని తరలిస్తామని చెబుతున్నారని, ఎవడబ్బ సొమ్మని తరలిస్తారని ఘాటుగా ప్రశ్నించారు. అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని అనుకోవడం భ్రమేనని శివాజీ తేల్చి చెప్పారు.