hema: తాగేసి జీవితాన్ని పాడుచేసుకున్న కొంతమంది ఆర్టిస్టులను చూసి ఆ నిర్ణయం తీసుకున్నాను: నటి హేమ

షార్ట్స్‌లో చూడండి
తాజా ఇంటర్వ్యూలో సీనియర్ నటి హేమ మాట్లాడుతూ .. కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. " చిత్రపరిశ్రమ ఇలా ఉంటుందనీ .. అలా ఉంటుందని ఆరంభంలో కొంతమంది నన్ను భయపెట్టారు. దాంతో జాగ్రత్తగా ఉండాలనే నిర్ణయం తీసుకునే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాను. నాకు కొత్త కావడం వలన నా జోలికి ఎవరూ రాకుండా నా సీనియర్స్ అండగా నిలిచారు.

చిత్రపరిశ్రమలో సీనియర్ ఆర్టిస్టుల్లో కొంతమంది తాగేసి ఆరోగ్యం .. జీవితం పాడుచేసుకున్న వాళ్లు వున్నారు. వాళ్లను చూసి జీవితంలో ఎక్కడా ఎప్పుడూ డ్రింక్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ దానికి నేను దూరంగానే వుంటూ వస్తున్నాను. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఇక ఇప్పటికీ నేను గ్లామరస్ గా కనిపించడానికి కారణం సమయానికి ఆహారం .. నిద్ర ఉండేలా చూసుకోవడమే" అని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
hema

More Telugu News