చంద్రబాబు పేరులోని ‘ద్ర’ అంటే దరిద్రమని ప్రజలు అనుకుంటున్నారు!: విజయసాయిరెడ్డి సెటైర్లు
- కరవు కాటకాలు, తుపాన్లు బాబు వెంటే ఉంటాయి
- జగన్ పేరులో గన్ ఉందని భూగోళ, ఖగోళ శాస్త్రాలు శోధించి కనిబెట్టాడు
- టీడీపీ అధినేతపై విమర్శల వర్షం కురిపించిన వైసీపీ నేత
విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ జగన్ గారి పేరులోనే గన్ ఉందట. తుప్పునాయుడు భూగోళ, ఖగోళ శాస్త్రాలన్నింటిని శోధించి కనిపెట్టాడు. తమరి పేరులోని “ద్ర” అంటే దరిద్రం అంటున్నారు ప్రజలు. కరువు కాటకాలు, తుఫాన్లు తమరి వెంటే కాచుకుని ఉంటాయి కదా. వణుకుతో ఏదేదో సణుగుతున్నారు. జనాలు నవ్వుకుంటారన్న సృహ కూడా లేదు’ అని దుయ్యబట్టారు.