రష్మిక మందనకి బర్త్ డే విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ .. 'డియర్ కామ్రేడ్' ఫస్టుసాంగు రిలీజ్ డేట్ ఫిక్స్
Add ap7am to your home Screen

రష్మిక మందనకి బర్త్ డే విషెస్ చెప్పిన విజయ్ దేవరకొండ .. 'డియర్ కామ్రేడ్' ఫస్టుసాంగు రిలీజ్ డేట్ ఫిక్స్

  • 'డియర్ కామ్రేడ్' గా విజయ్ దేవరకొండ
  •  ఈ నెల 8వ తేదీన ఫస్టు సాంగ్ రిలీజ్
  •   మే 31వ తేదీన సినిమా విడుదల   
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' నిర్మితమైంది. రష్మిక మందన కథానాయికగా నటించిన ఈ సినిమా, మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజున (ఏప్రిల్ 5) రష్మిక మందన పుట్టినరోజు. ఈ సందర్భంగా రష్మికకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, 'డియర్ కామ్రేడ్'లో ఆమె లుక్ కి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు.

ఈ సినిమా నుంచి ఫస్టు సాంగును ఈ నెల 8వ తేదీ(సోమవారం) ఉదయం 11 గంటల 11 నిమిషాలకి తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్న విషయాన్ని ఈ పోస్టర్ ద్వారానే ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ స్టూడెంట్ గాను .. రష్మిక క్రికెటర్ గాను కనిపించనుంది. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'గీత గోవిందం' సంచలన విజయాన్ని సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. 
vijay devarakonda
rashmika

More Telugu News