రెండు నిమిషాల్లో రూ. 7,572 కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్!
- దారుణంగా పడిపోయిన టెస్లా కార్ల అమ్మకాలు
- ఒక్కసారిగా వెల్లువెత్తిన వాటాల విక్రయం
- 1.1 బిలియన్ డాలర్లు నష్టపోయిన మస్క్
ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్న టెస్లా, ఈ సంవత్సరం తొలి మూడు నెలల వ్యవధిలో అమ్మకాలను ఏ మాత్రం పెంచుకోలేకపోయింది. 2018 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో 90,966 యూనిట్లను విక్రయించిన సంస్థ ఈ జనవరి - మార్చి మధ్య 63 వేల యూనిట్లను మాత్రమే అమ్మింది. ఈ గణాంకాలు బహిర్గతం కాగానే, టెస్లాపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, భారీ ఎత్తున ఈక్విటీలు అమ్మకానికి వచ్చాయి. కాగా, ఎలాన్ మస్క్ మొత్తం ఆస్తుల్లో దాదాపు 10 బిలియన్ డాలర్లు టెస్లా నుంచి వచ్చినవేకాగా, మిగతా 13 బిలియన్ డాలర్లు రాకెట్ బిజినెస్ చేస్తున్న స్పేస్ ఎక్స్ ప్రోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ నుంచి వచ్చింది.